హాట్‌స్పాట్లలో పరీక్షలు ఎలా చేస్తారు?:హైకోర్టు
close

తాజా వార్తలు

Published : 17/04/2020 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాట్‌స్పాట్లలో పరీక్షలు ఎలా చేస్తారు?:హైకోర్టు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవడం ఆందోళనకరమని హైకోర్టు అభిప్రాయపడింది. పెద్దసంఖ్యలో ఉన్న హాట్‌స్పాట్లలో ప్రజలకు పరీక్షలు ఎలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాఖలైన వివిధ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది.. టెస్టింగ్‌ కిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలని సూచించింది. ఈనెల 24లోపు దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

దీంతో పాటు లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారన్న వ్యాజ్యంపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని.. ప్రజలను కొట్టవద్దని డీజీపీ ఆదేశించారని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వనపర్తి ఘటనలో సస్పెన్షన్‌తో పాటు ఇంకా ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అతిగా ప్రవర్తించిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారో ఈనెల 24లోపు చెప్పాలని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని