విజయవాడలో 6 రెడ్‌ జోన్‌లు: సీపీ
close

తాజా వార్తలు

Updated : 19/04/2020 12:08 IST

విజయవాడలో 6 రెడ్‌ జోన్‌లు: సీపీ

విజయవాడ: నగరంలో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య 58కి చేరుకోవడంతో రెడ్‌ జోన్లలో భద్రతను మరింత పెంచారు.  సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తునన పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. 

భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెడ్‌ జోన్‌ ప్రాంతంలో భద్రతను ఆదివారం ఉదయం నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకాతిరుమలరావు పరిశీలించారు. నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరింత నిఘా పెంచినట్లు చెప్పారు. ‘‘విజయవాడలో ఆరు రెడ్‌ జోన్‌ ప్రాంతాలను గుర్తించాం. రెడ్‌జోన్‌లలో ప్రజలు తిరుగుతున్న దృష్ట్యా ఆ ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. రెడ్‌ జోన్ల పరిధిలో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. పోలీసులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా పరికరాలు అందిస్తున్నాం. కరోనాపై అవగాహనకు మొబైల్‌ వాహనాల్లో పోలీసు సిబ్బంది తిరుగుతారు’’ అని సీపీ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని