12 రోజుల పసిపాపకు కరోనా
close

తాజా వార్తలు

Published : 19/04/2020 21:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12 రోజుల పసిపాపకు కరోనా

ఆమె తల్లికి కూడా.. ఆరోగ్య కార్యకర్త ద్వారా సోకినట్లు అనుమానం!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 12 రోజుల పసిపాప, ఆమె తల్లికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని నగర ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ ఆదివారం వెల్లడించారు. మహిళ ప్రసవ సమయంలో ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ఆరోగ్య కార్యకర్త నుంచి వారికి ఈ వైరస్‌ సోకినట్లు అనుమానంగా ఉందని పాప తండ్రి చెబుతున్నారు. సదరు ఆరోగ్య కార్యకర్త కరోనా బారిన పడ్డట్లు ఇటీవలే తేలింది.

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీన పాప జన్మించింది. 11వ తేదీన తల్లీబిడ్డ డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఆసుపత్రిలోని మహిళా కార్యకర్తకు కరోనా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని గమనించిన పాప తండ్రి.. తమవారికీ సోకిందేమోనని అనుమానించాడు. ఇదే విషయాన్ని ఆసుపత్రి వర్గాల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇంటి సమీపంలోని హెల్త్‌క్యాంప్‌లో వైద్యులు ఇటీవల ఇద్దరి నమూనాలు సేకరించి పరీక్షకు పంపగా.. ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది. మధ్యప్రదేశ్‌లో ఈ మహమ్మారి బారిన పడ్డవారిలో తక్కువ వయస్సు ఈ పాపదే కావొచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని