ఔషధంపై చిగురించిన ఆశలు
close

తాజా వార్తలు

Updated : 30/04/2020 08:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఔషధంపై చిగురించిన ఆశలు

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ అనే సంస్థ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివిర్‌’ ఔషధం కరోనా వైరస్‌ ఆటకట్టించడంలో సమర్థంగా పనిచేస్తోందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. దీంతో కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందించడంపై సర్వత్రా ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 800 మంది బాధితులకు ఈ ఔషధాన్ని అందించగా.. ఇతర మందులు వాడిన వారితో పోలిస్తే రెట్టింపు వేగంతో వారు కోలుకున్నారని అధ్యయనంలో తేలింది.

జర్మనీలో మానవులపై టీకా పరీక్షలు ప్రారంభం
కరోనా నిర్మూలనే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థతో కలిసి తాము అభివృద్ధి చేసిన ‘బీఎన్‌టీ162’ అనే టీకాను మానవులపై పరీక్షించడం ప్రారంభించామని జర్మనీ కంపెనీ ‘బయోఎన్‌టెక్‌’ తెలిపింది. పరీక్షల్లో భాగంగా ఈ నెల 23 నుంచి ఇప్పటివరకు 12 మందికి దాన్ని అందించామని వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని