షేర్‌ మార్కెట్‌లో నష్టాలతో ప్రధానోపాధ్యాయుడి బలవన్మరణం
close

తాజా వార్తలు

Updated : 16/05/2020 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షేర్‌ మార్కెట్‌లో నష్టాలతో ప్రధానోపాధ్యాయుడి బలవన్మరణం

తిప్పర్తి, న్యూస్‌టుడే: షేర్‌ మార్కెట్‌లో నష్టాలు, ఆపై ఆర్థిక ఇబ్బందులతో ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండలోని హిమగిరికాలనీలో నివాసం ఉంటూ గుర్రంపోడ్‌ మండలం మైలపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మర్ల శ్రీనివాస్‌రెడ్డి(45)కి షేర్‌ మార్కెట్‌లో నష్టాలు రావడంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందాడు. శుక్రవారం ఉదయం స్కూటీపై తిప్పర్తి మండలం రాయినిగూడెంకు చేరుకున్నాడు. శివారులోని పరమేశ్వరి రైస్‌మిల్లు వద్ద పురుగులమందు తాగి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. షేర్‌ మార్కెట్‌ నష్టాలే కారణమని, తనను క్షమించాలని రాసిన లేఖ మృతుడి వద్ద లభించింది. శ్రీనివాస్‌రెడ్డికి భార్య సునీత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని