అశ్వగంధతో కొవిడ్‌కు ఔషధం!
close

తాజా వార్తలు

Updated : 19/05/2020 08:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అశ్వగంధతో కొవిడ్‌కు ఔషధం!

ఈనాడు, దిల్లీ: అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడికి కొవిడ్‌-19ని నిరోధించే ఔషధ లక్షణాలున్నట్లు దిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్సుడ్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నాలజీ సంయుక్త అధ్యయనంలో తేలింది. సంబంధిత పరిశోధన పత్రాన్ని జర్నల్‌ ఆఫ్‌ బయోమాలిక్యులర్‌ స్ట్రక్చర్‌ అండ్‌ డైనమిక్స్‌లో ప్రచురణకు అనుమతి లభించినట్లు దిల్లీ ఐఐటీ తెలిపింది. వైరస్‌ వ్యాప్తిలో కీలక భూమిక పోషిస్తున్న ప్రధాన ప్రొటీన్‌లను విభజించడానికి ఉపయోగపడే ఎస్‌-2 ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ పరిశోధనలు చేశారు. అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్‌ యాసిడ్‌ పెంథాల్‌ ఈస్ట్‌ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. ఈ ఔషధంతో కొవిడ్‌ మరణాలను తగ్గించవచ్చని, కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికీ ఉపయోగపడుతుందని పరిశోధక బృందం పేర్కొంది. ఈ సందర్భంగా దిల్లీ ఐఐటీ బయోకెమికల్‌ అండ్‌ బయోటెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ డి.సుందర్‌ మాట్లాడుతూ... ‘‘రోగ నిరోధక శక్తి పెంచే ఔషధంగా అశ్వగంధకు మంచి పేరుంది. తాజా పరిశోధన దీనికి వైరస్‌పై పోరాడే శక్తి సైతం ఉందనే సంకేతాన్ని ఇచ్చింది’’ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని