close

తాజా వార్తలు

Published : 23/05/2020 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పట్టపగలే ఆర్టీసీ బస్సు చోరీ

ధర్మవరం: ధర్మవరం డిపోలో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సు(ఏపీ02జడ్‌ 0552)ను శుక్రవారం మధ్యాహ్నం ముజామిల్‌ఖాన్‌ అనే వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. విషయాన్ని సెక్యూరిటీ కానిస్టేబుల్‌ సుష్మ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మామిళ్లపల్లి మీదుగా జాతీయ రహదారిపై బస్సు వెళుతున్నట్లు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ఆర్టీసీ సిబ్బంది గుర్తించి పోలీసులకు తెలియజేశారు. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు సిబ్బందితో కలసి బస్సును వెంబడించారు. కియా వద్ద ఎర్రమంచి పోలీసులను అప్రమత్తం చేయడంతో జాతీయ రహదారిపై ఎస్‌ఐ గణేష్‌ కంటెయినర్‌ వాహనాలను అడ్డుపెట్టించారు. ముందుకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ముజామిల్‌ఖాన్‌ బస్సు నిలిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని ధర్మవరం పట్టణ ఎస్‌ఐ జగదీష్‌కు అప్పగించారు. కర్ణాటకలోని విజయపురకు చెందిన నిందితుడు తాగిన మత్తులో ఉన్నాడని, సొంతూరికి వెళ్లేందుకుగాను బస్సు తీసుకెళ్లేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ భోజనానికి వెళ్లగా తీసుకెళ్లిపోయాడన్నారు. ధర్మవరం ఆర్టీసీ డీఎం మల్లికార్జున పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.