close

తాజా వార్తలు

Published : 23/05/2020 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సొంత పరీక్షల ఫలితాల్ని నమ్మొచ్చా?

కీలకమైన విభాగాల్లో పనిచేస్తున్న  అత్యవసర సిబ్బంది ఇళ్లకే స్వాబ్‌ టెస్ట్‌ కిట్లను పంపాలన్న బ్రిటన్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంతగా నిర్వహించుకొనే కొవిడ్‌ పరీక్షల తప్పుడు ఫలితాలను ఇవ్వొచ్చనే వాదనలను బలపర్చేలా పరిశోధనలు వెలువడుతున్నాయి. చైనాలో కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో వైద్య నిపుణులు సేకరించిన పరీక్ష (స్వాబ్‌ టెస్ట్‌)ల్లో 30శాతం ఫలితాలు తప్పుగా వెల్లడైనట్లు గుర్తించారు. ఈ దశలో సొంతగా స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించుకొంటే ఆ ఫలితాలు మరింత దారుణంగా వెల్లడికావచ్చని నిపుణులు చెబుతున్నారు. అటువంటప్పుడు వైరస్‌వ్యాప్తి  తీవ్రమవుతుందని చెబుతున్నారు. స్వాబ్‌ టెస్ట్‌ విధివిధానాలను సరిగా పాటించకపోతే తప్పుడు ఫలితాలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ‘ఆసుపత్రిలో ఉన్న ఒక వ్యక్తిలో కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నా..అతనికి నెగిటివ్‌ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది’ అని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు    చెందిన గ్రహం కుక్‌ తెలిపారు. మరోపక్క అమెరికాలో ఇటీవల నిర్వహించిన ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. సొంతగా తెమడ నమూనాలు సేకరించే పరీక్షలు తక్కువగా ఉండటంతో ఇతర విధానాలపై దృష్టిపెట్టాలని దీనిలో పాల్గొన్న నిపుణులు సూచించారు. ముఖ్యంగా నోటిలోని లాలాజలాన్ని సేకరించుకొని దానిని ల్యాబ్‌ పరీక్షలకు పంపడం మెరుగైన విధానమని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చెందిన అన్నె   వెల్లై తెలిపారు. అమెరికా ఎఫ్‌డీఏ కూడా   ఈ విధానానికి ఆమోదముద్ర వేసింది. అయినా బ్రిటన్‌ మాత్రం స్వాబ్‌ టెస్ట్‌కు సొంతంగా నమూనాలు సేకరించుకొనే   విధానాన్నే కొనసాగిస్తోంది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని