పొగాకు బేళ్లను తగులబెట్టిన రైతులు
close

తాజా వార్తలు

Updated : 23/05/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొగాకు బేళ్లను తగులబెట్టిన రైతులు

మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డి.సి పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డి.సి పల్లిలోని పొగాకు వేలం కేంద్రానికి రైతులు భారీగా పొగాకు బేళ్లను తీసుకొచ్చారు. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో నిర్వాహకులను రైతులు నిలదీశారు. దీంతో పొగాకు వేలం నిలిచిపోయింది. ఆగ్రహించిన రైతులు అధికారుల వైఖరిని నిరసిస్తూ జాతీయ రహదారిపై  బైఠాయించి   పొగాకు బేళ్లను తగులబెట్టారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రైతులను ఆడ్డుకోవడంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో డి.సి.పల్లి పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.174, కనిష్ఠ ధర రూ.80గా ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమైన కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. ధరలు పుంజుకుంటాయని రైతులు ఆశతో ఎదురు చూశారు. ఎంతకీ ధరలు పెరగకపోవడంతో నిరాశకు గురై ఆందోళనకు దిగారు. కిలో పోగాకు గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.130 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేలం బోర్డు నిర్వాహకులు, కంపెనీ ప్రతినిధులను కోరుతున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని