close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకలి తీరుస్తున్న ‘హైదరాబాద్‌ బాయ్స్‌’

ఈనాడు, హైదరాబాద్‌: సేవాభావమే వారందర్నీ ఒకచోటకు చేర్చింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై.. చాలామందికి పూట గడవడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో అన్నార్తులకు అండగా 40 రోజులుగా కలిసికట్టుగా సాగుతున్నారు సత్యసాయి సేవా సమితికి చెందిన ‘హైదరాబాద్‌ బాయ్స్‌’ బృందం. బోయిన్‌పల్లి శోభా గార్డెన్స్‌లోని నిత్యం 8 వేల వరకు ఆహార ప్యాకెట్లు తయారు చేసి జీహెచ్‌ఎంసీ, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా అభాగ్యులకు అందిస్తున్నారు.

మూడు వందలతో మొదలై..
రోజుకు కనీసం ఒక పూటైనా పేదల ఆకలి తీర్చాలని సత్యసాయి సేవా సమితి ఏప్రిల్‌ 13వ తేదీన 300 ఆహార పొట్లాలను తయారు చేసి పంపిణీ ప్రారంభించారు. మూడు రోజుల్లోనే ఆ సంఖ్య 6వేలకు పెరిగింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఏ రోజు ఎంతమందికి అవసరం అని జీహెచ్‌ఎంసీ, పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఆ మేరకు రెండు పూటలా రుచికరమైన ఆహారం సిద్ధం చేయడంలో దాదాపు 40 మంది సేవాదళ్‌ సభ్యులు నిమగ్నమవుతున్నారు. వీరిలో అధ్యాపకులు, పరిశోధకులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వ్యాపారస్థులు, విశ్రాంత సైనికాధికారులు ఉన్నారు. వీరిలో కొంతమంది నెలరోజులుగా తయారీ కేంద్రంలోనే ఉంటున్నారు.

నెలాఖరు వరకు..
ఎప్పటికప్పుడు మెనూ మారుస్తూ.. పంపిణీ చేసే ఆహారాన్నే సేవాదళ్‌ సభ్యులూ తింటున్నారు. శుక్రవారం తయారు చేసిన 7,800 ఆహార పొట్లాల్లో 2,500 వలస కూలీలకు అందించారు. ‘ఇప్పటివరకు 2.42 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశాం. ఇందుకు అవసరమైన నిధులను మేమే సమకూర్చుకున్నాం. వంట చేసుకునేందుకు శోభా గార్డెన్స్‌ను యాజమాని శాంతారామ్‌ ఉచితంగా ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తాం’ అని హైదరాబాద్‌ బాయ్స్‌కు నేతృత్వం వహిస్తున్న ఉదయ్‌భాస్కరరెడ్డి తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.