close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 06:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు ప్రాణాలను తొక్కేసిన కార్లు

 హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై దంపతుల దుర్మరణం
 మేనకోడలి నిశ్చితార్థానికి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం

పూడూరు, న్యూస్‌టుడే: నిశ్చితార్థానికి వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. వెనుక నుంచి ఒక కారు ఢీకొట్టగా.. ముందు నుంచి మరో కారు వీరిపై నుంచి దూసుకెళ్లి మృత్యువు పాలు చేసింది. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తి గేటు వద్ద (హైదరాబాద్‌-బీజాపూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై) ఈ ఘోరం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటకు చెందిన దంపతులు యు.ఆనంద్‌(35), ఉషమ్మ(30) ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. వీరు హైదరాబాద్‌ శివారు గండిమైసమ్మలో ఉంటున్నారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. బుధవారం పూడూరు మండలం సోమన్‌గుర్తిలో ఆనంద్‌ సోదరి కుమార్తె నిశ్చితార్థానికి భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. ఉదయం 7 గంటలకు సోమన్‌గుర్తి గేటు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ధాటికి ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. అంతలోనే ఎదురుగా పరిగి వైపు నుంచి దూసుకొచ్చిన (ఏపీ10ఏటీ2825) మరో కారు వీరి పైనుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.