ఆ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలి
close

తాజా వార్తలు

Updated : 02/06/2020 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలి

తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు రైళ్లు, బస్సులు ఎక్కేవరకు వారికి భోజనం, వసతి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటుక బట్టీల కార్మికులు, వలస కూలీలను స్వస్థలాలను తరలించాలని దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కార్మిక శాఖ ఉప కమిషనర్లు ఇటుక బట్టీలు సందర్శించి వలస కూలీలను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. స్వస్థలాలకు వెళ్లాలనుకునే  వలస కూలీలను షెల్టర్‌ జోన్లకు తరలించాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దక్షిణ మధ్య రైల్వే సమన్వయంతో స్వస్థలాలకు పంపించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలని పేర్కొంది. శ్రామిక్‌ రైళ్లు పెంచాలి లేదా కూలీల కోసం ప్రత్యేక రైళ్లలో 4 బోగీలు ఏర్పాటు చేయాలని సూచించింది. శ్రామిక్‌ రైళ్లు, ప్రత్యేక బోగీలు, ఆర్టీసీ బస్సుల్లో తరలించే వలస కూలీల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిని స్వరాష్ట్రాలకు పంపించే సమయంలో ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని హైకోర్టు సూచించింది. విపత్కర పరిస్థితుల్లో వలస కూలీల సమస్యపై ప్రభుత్వం సమగ్ర పాలసీ రూపొందించాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని