రైలు దొరకలేదని.. ఏకంగా కారుకొన్నాడు!
close

తాజా వార్తలు

Updated : 05/06/2020 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైలు దొరకలేదని.. ఏకంగా కారుకొన్నాడు!

గోరఖ్‌పూర్‌: లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకున్న వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎలాగైనా తన స్వగ్రామానికి వెళ్లాలనుకున్న ఓ వ్యక్తికి, అతడి కుటుంబసభ్యులకు ఆ రైల్లో చోటు లభించలేదు. దీంతో అసహనానికి గురైన అతడు ఏకంగా కారునే కొనేశాడు.

గోరఖ్‌పూర్‌కు చెందిన లల్లాన్‌ అనే వ్యక్తి ఘజియాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ ముగుస్తుందనే ఆశతో కుటుంబంతో కలిసి ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నాడు. అయితే ప్రభుత్వాలు దశలవారీగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే ఉండడంతో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మూడురోజుల పాటు శ్రామిక్‌ రైలు ఎక్కేందుకు తన వంతు కోసం ప్రయత్నించాడు. నాలుగో రోజు అసహనానికి గురై కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో ఉన్న రూ.1.9 లక్షల నుంచి రూ.1.5 లక్షలు డ్రా చేసి ఓ పాత కారును కొన్నాడు. దానిలో తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 29న తన స్వగ్రామానికి చేరుకున్నాడు.

‘‘లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయని అనుకున్నా. కానీ లాక్‌డౌన్‌ దశలవారీగా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో నేను, నా కుటుంబం స్వగ్రామానికి తిరిగి రావడమే మంచిదని భావించాను. ఈ క్రమంలో రైలు ప్రయాణం కోసం ప్రయత్నించి విఫలమయ్యాం. బస్సుల్లో రద్దీగా ఉండడంతో మేం భౌతిక దూరం పాటించటం కుదరదు. కాబట్టి కరోనా వైరస్‌ సోకుతుందని భయపడ్డాను. ఎంత ఖర్చైనా.. నా కుటుంబం సురక్షితంగా ఉంటుందని కారు కొనుగోలు చేశాను’’ అని లల్లాన్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని