close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 07/06/2020 08:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీజీహెచ్‌లో బెజవాడ గ్యాంగ్‌ కలకలం

గుంటూరు: విజయవాడలో ఇటీవల జరిగిన గ్యాంగ్‌వార్‌లో గాయపడి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ వర్గం నాయకుడు కేటీఎం పండు ఉన్న వార్డులో ఓ అపరిచిత వ్యక్తి సంచరించినట్లు వదంతులు వ్యాపించాయి. దీంతో శనివారం ఆసుపత్రిలో కొద్దిసేపు కలకలం రేగింది. పండు చికిత్స పొందుతున్న వార్డులో ఉన్న ఓ రోగిని చూడటానికి వచ్చారని నిర్ధారించుకుని పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే పండు చికిత్స పొందుతున్న వార్డు వద్ద పోలీసు భద్రత కొనసాగుతోంది. అక్కడ విజయవాడ పోలీసులతో పాటు గుంటూరు పోలీసులు నిత్యం విధి నిర్వహణలో ఉంటున్నారు. ఈ వార్డులో మరికొందరు ఇతర రోగులు ఉన్నారు. వారిలో ఒకరిని చూడటానికి నేరుగా వార్డు వద్దకు వచ్చిన బంధువు పోలీసులు ఉండటం చూసి భయపడి వెనక్కువెళ్లిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో పనిచేసే మరో తెలిసిన వ్యక్తిని వెంటబెట్టుకుని తిరిగి వార్డులోకి వచ్చి రోగిని కలిసి వెళ్లిపోయారు. పోలీసులు హడావుడి పడి చివరికి ఏమీ లేదని నిర్థారించుకున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.