ఆసుపత్రిలోకి భారీగా చేరిన వరదనీరు
close

తాజా వార్తలు

Published : 15/06/2020 23:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రిలోకి భారీగా చేరిన వరదనీరు

మహారాష్ట్ర: కరోనాతో సతమతమవుతున్న మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జల్‌గావ్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి డాక్టర్‌ ఉల్హాస్‌ పాటిల్‌ ఆసుపత్రి అత్యవసర విభాగంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. నీరు మోకాళ్ల లోతుకు చేరడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఆసుపత్రిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సుమారు ఎనిమిది మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ ఆసుపత్రిలోని మొదటి అంతస్తులోకి మార్చినట్లు చెప్పారు. అయితే, పలు వైద్య పరికరాలు పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు వివరించారు. అదే ఆసుపత్రిలోని ఓ విభాగంలో కొవిడ్‌ బాధితులకు కూడా చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. 

ఘటనపై భాజపా నేత ఒకరు స్పందిస్తూ.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్నారు. సమస్యను అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దీనిపై స్థానిక మంత్రి గులాబ్రో పాటిల్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆసుపత్రికి సమీపంలో ఉన్న హైవేపై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అందుకని వర్షపు నీరంతా ఆసుపత్రి వైపు చొచ్చుకొచ్చిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,07,958 మంది వైరస్‌ బారిన పడగా.. 3,950మంది మృతి చెందారు. 50,978మంది బాధితులు కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 53,030 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని