కరోనా టెస్టులు, చికిత్స ఫీజులు పెంచండి!
close

తాజా వార్తలు

Published : 19/06/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టెస్టులు, చికిత్స ఫీజులు పెంచండి!

హైదరాబాద్‌: కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మరోమారు పరిశీలించాలని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి ఈటలను కోరారు. ఈ మేరకు బీఆర్‌కే భవన్‌లో వారు మంత్రిని కలిశారు. కరోనా టెస్టులు, చికిత్సకు సంబంధించి నిర్ణయించిన ఫీజులు మరికొంత పెంచాలని కోరినట్టు సమాచారం. 

దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ.. ప్రజలకు వైద్యం అందించేందుకు సహకరించాలని వారిని కోరారు. కరోనా లక్షణాలు లేని వారికి ఇంటి వద్దే చికిత్స అందించాలన్నారు. ఐసీయూలో ఉన్న వారికి సైతం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చికిత్స అందించాలన్నారు. ప్రజల కోరిక మేరకు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతమంది రోగులకైనా చికిత్స ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని