ఆత్మహత్య చేసుకోవాలనిపించింది...
close

తాజా వార్తలు

Published : 24/06/2020 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆత్మహత్య చేసుకోవాలనిపించింది...

భార్య వైద్యం కోసం సైకిల్‌పై వంద కిలోమీటర్లు

రాంచి: పవిత్రమైన వృత్తిలో ఉన్న కొందరి ప్రవర్తన మానవత్వానికే మచ్చతెచ్చేలా ఉండగా.. అదే వృత్తిలోని మరొకరి దాతృత్వం పేదవారి ప్రాణాన్ని నిలబెట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాకు చెందిన హరి అనే వ్యక్తి ఓ రిక్షా కార్మికుడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించటంతో.. తన భార్యను కాపాడుకునేందుకు పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్‌కు 100 కిలో మీటర్ల మేరకు సైకిల్‌పై ప్రయాణించాడు.

‘‘విపరీతమైన కడుపు నొప్పితో ఏడుస్తున్న నా భార్యను పురులియాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడి వైద్యులు కొవిడ్‌ భయంతో ఆమెను తాకటానికి కూడా నిరాకరించారు. నా భార్యను మరో చోటికి తీసుకెళ్లాల్సిందిగా సలహా ఇచ్చారు. నా నిస్సహాయ స్థితికి బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఎలాగో ధైర్యం కూడదీసుకుని కొందరు శ్రేయోభిలాషుల సలహాతో సైకిల్‌ను అద్దెకు తీసుకున్నాను. దానిపై నా భార్య, ఏడు సంవత్సరాల కుమార్తెతో సహా 100 కి.మీ దూరంలో ఉన్న జంషెడ్‌పూర్‌లోని గంగా మెమోరియల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాను. నా భార్య స్థితిని చూసిన అక్కడి వైద్యులు వెంటనే చికిత్స ఆరంభించారు. ప్రైవేట్‌ ఆస్పత్రి అయినా ఉచితంగా చికిత్స చేశారు. లేకుంటే ఎంతో మంది లాగా నా భార్య కూడా మరణించి ఉండేది’’ అని హరి వివరించారు.
అప్పటికే ఉండుకం‌ విచ్ఛిన్నం కావటంతో బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. అందుకే ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్స చేశామని డాక్టర్‌ ఎన్. సింగ్‌ తెలిపారు. హరి వద్ద కనీసం సైకిల్‌ అద్దెకు కూడా డబ్బులేకపోవటంతో తానే అతనికి కొంత సొమ్ముతో పాటు ఓ సైకిల్‌ను కూడా ఇచ్చినట్టు తెలిపారు. వైద్యం లభించక తండ్రిని పోగొట్టుకున్న తాను.. అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు లేదని ఏ ఒక్కరికీ వైద్యం తిరస్కరించనని డాక్టర్‌ సింగ్‌ వివరించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని