జీవించాలని లేదు.. క్షమించండి
close

తాజా వార్తలు

Updated : 27/06/2020 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవించాలని లేదు.. క్షమించండి

పిల్లలు పుట్టలేదంటూ భర్త చిత్రహింసలు..

అత్తామామల వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం

 హైదరాబాద్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: పిల్లలుపుట్టడం లేదంటూ భర్త, అత్తామామల వేధింపులతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్‌ ఆర్జీఐఏ సీఐ విజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్‌రావు, లావణ్యలహరి(32) ప్రేమించుకొని రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో పైలెట్‌గా పనిచేస్తుండగా.. లావణ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తోంది. శంషాబాద్‌లోని రాళ్లగూడ సీఎస్‌కే విల్లాస్‌లో ఉంటున్నారు. పిల్లలు పుట్టడం లేదంటూ భార్యను వెంకటేశ్వర్‌రావు రోజూ హింసిస్తుండగా.. అతని తల్లిదండ్రులు సూటిపోటి మాటలతో వేధించేవారు. గురువారం రాత్రి ‘‘మానసిక వేధింపుల కారణంగానే ఆత్యహత్య చేసుకుంటున్నా.. బతకాలని లేదు సారీ’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో లావణ్య పోస్టు చేసింది. సూసైడ్‌ నోట్‌ రాసి అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసి విలపించారు.

ప్రేమించి మోసపోయా.. వెంకటేశ్వరరావును ప్రేమించి మోసపోయానంటూ లావణ్య పోస్ట్‌లో పేర్కొంది. భర్త మరో యువతి జీవితంతో ఆడుకోవడం చూడలేక తనువు చాలిస్తున్నానంటూ పేర్కొంది. తనను వదిలించుకోవాలనే చిత్రహింసలు పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతేడాది ఓ రోజు తనను చితకబాదుతుండగా... పెంపుడు కుక్క అడ్డుకుందని పేర్కొంటూ సీసీ టీవీ ఫుటేజీని సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. అతనిపై కేసులున్నాయని, ఆయన పాపాలే అతని జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొంది. నిందితుణ్ని అరెస్ట్‌ చేశామని డీసీపీ ఎన్‌.ప్రకాష్‌రెడ్డి తెలిపారు. కేసుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని