మాస్క్‌ పెట్టుకోమంటే కొట్టి..సస్పెండయ్యాడు
close

తాజా వార్తలు

Published : 01/07/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ పెట్టుకోమంటే కొట్టి..సస్పెండయ్యాడు

నెల్లూరు: మాస్కు పెట్టుకోవాలని సూచించినందుకు తోటి ఉద్యోగినిపై విచక్షణా రహితంగా దాడి చేసిన అధికారి ఎట్టకేలకు సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే... నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగి.. కరోనా నేపథ్యంలో మాస్కు పెట్టుకోవాలని పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌కు సూచించారు. దీంతో ఆగ్రహించిన డిప్యూటీ మేనేజర్‌ ..మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టకుని కుర్చీలో నుంచి కింద పడేసి.. కుర్చీ హ్యాండిల్‌తో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 27న జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సస్పెండ్‌ చేశాం: ఏపీ టీడీసీ ఎండీ
ఈనెల 27న నెల్లూరులోని టూరిజం హోటల్‌ కార్యాలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఏపీ టీడీసీ ఎండీ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. నెల్లూరు పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసినట్టు చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకున్నామని వివరించారు. విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా భాస్కర్‌ హెడ్‌క్వార్టర్‌ వదిలి వెళ్లరాదని ఆదేశించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని