నెల్లూరు ఘటనపై NCW స్పందన
close

తాజా వార్తలు

Updated : 30/06/2020 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరు ఘటనపై NCW స్పందన

వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వండి

దిల్లీ: నెల్లూరులో టూరిజం కార్యాలయ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్‌ దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ (NCW) తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై చేపట్టిన చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. దివ్యాంగురాలైన ఉద్యోగిపై దాడి దిగ్భ్రాంతి కలిగించిందని లేఖలో మహిళా కమిషన్‌ వ్యాఖ్యానించింది. ఘటనపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో ఆదేశించింది. 

21 రోజుల్లో విచారిస్తాం...
నెల్లూరు: నెల్లూరు ఘటనలో బాధితురాలుని  రాష్ట్ర మహిళా కమిషనర్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. దాడి చేసిన ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను కఠినంగా శిక్షిస్తామని ఆమె చెప్పారు. 21 రోజుల్లో భాస్కర్‌పై విచారణ జరిపి నిర్భయ కేసు పెడతామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రస్తుతం డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ పోలీసు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని