అంతిమ కుసంస్కారం
close

తాజా వార్తలు

Published : 01/07/2020 07:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతిమ కుసంస్కారం

బళ్లారి, న్యూస్‌టుడే: కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియలను అమానవీయంగా నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సోమవారం ఒక్కరోజే 12 మంది చనిపోయారు. అక్కడి సిబ్బంది ప్రత్యేక వాహనంలో నల్లని సంచుల్లో చుట్టి ఉంచిన 8 మృతదేహాలను నిర్దేశిత ప్రాంతంలో అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతదేహాలను గుంతల దాకా ఈడ్చుకెళ్లారు. ఒక గుంతలోనే నాలుగు మృతదేహాలను పూడ్చిపెట్టడం, పైగా వాటిని గుంతల్లోకి విసరడం వంటి దృశ్యాలున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ విషయం బళ్లారి జిల్లా పాలనాధికారి ఎస్‌.ఎస్‌.నకుల్‌ దృష్టికి రాగా విచారణకు ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని