కమిటీ ఏర్పాటు చేసి.. 3 నెలల్లో నివేదికివ్వండి
close

తాజా వార్తలు

Updated : 01/07/2020 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమిటీ ఏర్పాటు చేసి.. 3 నెలల్లో నివేదికివ్వండి

దిల్లీ: తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర ఇసుక అక్రమ తవ్వకాలు, రొయ్యల చెరువులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. రాజోలు, అంతర్వేది సహా వివిధ ప్రాంతాల్లో సముద్ర ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని ఏనుమోలు వెంకటపతిరాజు పిటిషన్‌ వేశారు. అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు సముద్రానికి సమీపంలో అక్రమ రొయ్యల చెరువులు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. 

కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ, జిల్లా కలెక్టర్‌తో కలిపి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని తెలిపింది. అయితే అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అనంతరం కేసు విచారణను ఎన్జీటీ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని