close

తాజా వార్తలు

Published : 04/07/2020 07:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోల్కొండ, చార్మినార్‌ సందర్శించొచ్చు

ఆరో తేదీ నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌

రోజుకు 2 వేల మందికే అవకాశం

గోల్కొండ, న్యూస్‌టుడే: మూడునెలలుగా పర్యాటకులు లేక బోసిపోయిన చారిత్రక ప్రదేశాలు.. మళ్లీ పర్యాటకులతో కళకళలాడనున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్‌లోకి ఈనెల 6 నుంచి పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తుశాఖ నిర్ణయించింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తదితర అంశాలపై శుక్రవారం ఆశాఖ(హైదరాబాద్‌ సర్కిల్‌) సూపరింటెండెంట్‌ మిలన్‌కుమార్‌ చౌవ్లా గోల్కొండ కోట, చార్మినార్‌ల ఇన్‌ఛార్జి ఎం.నవీన్‌కుమార్‌, భానుప్రకాశ్‌ వర్మలతో సమావేశమయ్యారు. రోజుకు 2 వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. ప్రవేశ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. నిర్మాణాల వద్ద టిక్కెట్లు విక్రయించరు. పర్యాటకులు మాస్కులు ధరించడంతో పాటు ఎడం పాటించాలని తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ వెబ్‌సైట్‌ ఏఎస్‌ఐ.ఎన్‌ఐసీ.ఇన్‌లో టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్ఛు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని