మాస్క్‌ లేదని వివాదం.. యువతి మృతి
close

తాజా వార్తలు

Published : 12/07/2020 08:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ లేదని వివాదం.. యువతి మృతి

రెంటచింతల, న్యూస్‌టుడే: మాస్క్‌ వేసుకోలేదని జరిగిన వివాదంలో యువతి మృతి చెందిన సంఘటన రెంటచింతలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... రెంటచింతల పిచ్చికుంట వీధిలో నివాసం ఉంటున్న కర్నాటి యలమంద వ్యక్తిగత పనులపై చెరువు సమీపంలోని వీధిలో మాస్క్‌ లేకుండా వెళ్లాడు. అక్కడున్న యువకులు మాస్క్‌ లేకుండా వచ్చినందుకు అభ్యంతరం తెలిపారు. కొద్ది రోజుల తరువాత చెరువు సమీప వీధి యువకులు పిచ్చికుంట బజారుకు మాస్క్‌లేకుండా రావడంతో యలమంద బంధువులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈనెల 3న(శుక్రవారం) ఘర్షణ నెలకొంది. నలుగురు కర్రలతో యలమందపై దాడి చేశారు. అడ్డొచ్చిన కుమార్తె కర్నాటి ఫాతిమా(19) తలకు బలమైన గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా సురేష్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని