రెమిడెసివిర్‌ను విచ్చలవిడిగా వాడొద్దు!
close

తాజా వార్తలు

Published : 12/07/2020 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెమిడెసివిర్‌ను విచ్చలవిడిగా వాడొద్దు!

ఐసీఎంఆర్, ఎయిమ్స్‌ హెచ్చరిక

దిల్లీ: కొవిడ్‌-19కు ప్రయోగాత్మక చికిత్స విధానాలుగా నిర్దేశించిన రెమిడెసివిర్, టోసిలిజుమాబ్‌ వంటి ఔషధాలను కచ్చితంగా నిబంధనల మేరకే వాడేలా చూడాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), ఎయిమ్స్‌లు రాష్ట్రాలకు సూచించాయి. వాటిని విచ్చలవిడిగా వాడటం లేక వాడకూడని పరిస్థితుల్లో ఉపయోగించడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని స్పష్టం చేశాయి. కొవిడ్‌కు నిర్దిష్టంగా ఎలాంటి చికిత్స లేని పరిస్థితుల్లో వీటిని సూచిస్తున్నట్లు పేర్కొన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా వాడాలని, వాటివల్ల కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు కలిగినవారు రెమిడెసివిర్‌ వల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని, అయితే అది మరణాలను తగ్గిస్తుందనడానికి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని