close

తాజా వార్తలు

Published : 13/07/2020 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అయినవారు దూరమై.. ఆలనా పాలనా కరవై...

రాయలచెరువు(యాడికి), : ఆత్మీయతను పంచిన ఆ అమ్మకు ఆప్యాయత కరవైంది. అయినవారు దూరమై.. బాగోగులు చూసేవారు లేక ఒంటరిగా బతుకీడుస్తోంది. తానెక్కడున్నానో తెలియక ఆందోళన చెందుతుంది. ఎండావానకు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఆలూరుకు చెందిన పార్వతమ్మను నాలుగు రోజుల క్రితం ఓ ఆటోవాలా రూ.5 వేలు తీసుకొని రాయలచెరువు బస్టాండులో వదిలివెళ్లాడు. తనను ఆలూరు సమీపంలోని కత్రిమల వద్ద వదలమంటే ఇక్కడ వదిలాడని, ఇది కత్రిమలేనా అంటూ ఆమె స్థానికులను అడుగుతుంది. ఆలూరులో తన ఇద్దరు కుమారులున్నారని, పీఆర్‌ పల్లిలో కుమార్తె ఉందని వృద్ధురాలు చెప్పింది. దీంతో స్థానికులు వారికి సమాచారం ఇచ్చారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని