close

తాజా వార్తలు

Published : 13/07/2020 09:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊరంతా కదిలి వస్తే గానీ పరీక్ష చేయలేదు

చివరికి పాజిటివ్‌ వచ్చింది

వల్లూరు(ఆచంట), న్యూస్‌టుడే: ఆచంట మండలం వల్లూరు శివారు కాసానివారిపాలెంనకు చెందిన 53 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహశీల్దారు ఆర్వీ కృష్ణారావు తెలిపారు. బాధితుడికి కరోనా పరీక్ష చేయించడానికి ఊరంతా కదలి వస్తేగానీ వైద్యులు స్పందించలేదు. సదరు వ్యక్తి పది రోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యంగా ఉండటంతో కరోనా అనుమానంతో కరోనా పరీక్షల కోసం వల్లూరు పీహెచ్‌సీకి రెండుసార్లు వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మూడు రోజుల కిందట గ్రామానికి చెందిన సుమారు 50 మంది పీహెచ్‌సీకి వెళ్లి ఆందోళన చేశారు. చివరికి గురువారం కరోనా పరీక్ష కోసం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని సిఫార్సు చేశారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా కిట్లు లేవని పరీక్ష చేయలేదు. మరుసటి రోజు శుక్రవారం వెళ్లగా పరీక్ష కోసం నమూనాలు స్వీకరించారు. శనివారం అర్ధరాత్రి ఫలితాలు రాగా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో బాధితుడిని భీమవరం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. హైదరాబాద్‌ వెళ్లి వచ్చిన అనంతరం బాధితుడు గ్రామంలో తిరగడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అతనితో సన్నిహితంగా మెలిగిన సుమారు 10 మందిని గుర్తించినట్లు సమాచారం.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని