
తాజా వార్తలు
పరిశ్రమల అభివృద్ధికి 1.10 లక్షల హెక్టార్ల భూమి
దిల్లీ: నౌకాశ్రయాల ఆధారంగా పరిశ్రమల స్థాపనను ఇతోధికం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దేశంలోని ప్రధానమైన 12 నౌకాశ్రయాలకు అనుబంధంగా 1.10 లక్షల హెక్టార్ల భూమిని ఇందుకు కేటాయించిందని కేంద్రమంత్రి మన్సుఖ్ మందవీయ తెలిపారు. ఏయే పరిశ్రమలను ఈ భూముల్లో నెలకొల్పితే బాగుంటుందనే విషయమై అంచనాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, కాండ్లా, ముంబయి, జేఎన్పీటీ, మార్ముగోవా, న్యూమంగళూర్, కోచి, చెన్నై, కామరాజార్ (ఎన్నోర్), వీఓ చిదంబరనర్, పారాదీప్, కోల్కతా (హల్దియా సహా) నౌకాశ్రయాల సమీపాలన ఈ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక.
Tags :