నేడు భారత్‌-చైనా ఉన్నతాధికారుల భేటీ
close

తాజా వార్తలు

Published : 14/07/2020 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడు భారత్‌-చైనా ఉన్నతాధికారుల భేటీ

దిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరళ్ల మధ్య మంగళవారం సమావేశం జరగనుంది. తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుషూల్‌లో ఈ చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడం, బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై విధివిధానాలను ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నట్లు సోమవారం భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి. చైనా సైన్యం ఇప్పటికే గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌, గల్వాన్‌లోయ నుంచి వెనక్కి మళ్లింది. ఫింగర్‌-4, పాంగాంగ్‌ సరస్సుల వద్ద సైనికుల సంఖ్యను తగ్గించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని