అవసరాల మేరకు సిబ్బంది నియామకం: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 15/07/2020 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవసరాల మేరకు సిబ్బంది నియామకం: కేటీఆర్‌

హైదరాబాద్‌: పురపాలికల్లో ప్రస్తుత సిబ్బందిని హేతుబద్దీకరించి, ఆ తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మున్సిపాలిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల చెప్పిన మంత్రి.. తాజాగా ఆ అంశంపై ఇవాళ సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు కోసం ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని, పెరుగుతున్న పట్టణీకరణ, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని కేటాయిస్తామని కేటీఆర్‌ చెప్పారు. కొత్త నియామకాల్లో ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాలు కల్పించే విభాగాలకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. నూతన పురపాలక చట్టం నియమనిబంధనల మేరకు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే దిశలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని