కరోనా పరీక్షల్లో జాప్యం వద్దు: ఏపీ
close

తాజా వార్తలు

Published : 15/07/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పరీక్షల్లో జాప్యం వద్దు: ఏపీ

అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల కరోనా పరీక్షల ఫలితాలు జాప్యమవుతున్న ఘటనలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అన్ని వీఆర్‌డీఎల్‌, ట్రూనాట్‌ ల్యాబుల్లో నమూనా సేకరణ కౌంటర్ల ఏర్పాటుకు ఆదేశించింది. ఈ కౌంటర్లు 24 గంటలూ పని చేయాలని సంయుక్త కలెక్టర్లకు ఆదేశించింది. నమూనా ఫలితాలు వచ్చాక కొవిడ్‌ పోర్టల్లలో నమోదు చేయాలని సూచించింది. కొవిడ్‌ ప్రోటోకాల్‌ మేరకు నమూనాలు జాగ్రత్త చేయాలని స్పష్టం చేసింది.రెడ్‌మార్క్ నమూనా గల ఫలితాలు త్వరగా ఇవ్వాలని ఆదేశించింది. కరోనా రోగికి మళ్లీ పాజిటివ్‌ వస్తే దానిని కొత్త కేసుగా ప్రకటించవద్దని తెలిపింది. ఎంఎస్‌ఎస్‌ కోవిడ్‌, ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో నమోదైనవి ఆరుగంటల కంటే ఆలస్యం కావొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని