close

తాజా వార్తలు

Published : 03/08/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకట్టుకుంటున్న హరిత రాఖీలు

భువనేశ్వర్‌: పర్యావరణహితంగా తయారైన హరితరాఖీలు(గ్రీన్‌రాఖీలు) అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాఖీపౌర్ణమి సందర్భంగా సరికొత్త డిజైన్ల రాఖీలతో కళకళలాడే మార్కెట్లు కరోనా కారణంగా వెలవెలబోతున్నాయి. అయితే ఒడిశాలో లభిస్తున్న హరితరాఖీలు ఆ లోటును కొంతవరకు తీరుస్తున్నాయి. మయూర్భంజ్‌ జిల్లాలో లభించే ‘సబై’ అనే ప్రత్యేకమైన గడ్డిపోచలతో వీటిని తయారు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా స్థానిక మహిళలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ హరితరాఖీలను తయారుచేసి విక్రయిస్తున్నారు. వివిధ రంగులు, డిజైన్లలో పూర్తి పర్యావరణహితంగా తయారు చేయడం వీటి ప్రత్యేకత. గ్రీన్‌రాఖీలుగా పిలిచే వీటికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని