close

తాజా వార్తలు

Updated : 09/08/2020 07:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుమానాస్పద స్థితిలో వరుడి మృతి

పెళ్లి ఇంట విషాదం

మహబూబాబాద్‌ రూరల్‌:  మరి కొద్ది గంటల్లో మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి ప్రవేశించాల్సిన ఆ వరుడు విగతజీవిగా మారడంతో పెళ్లింట విషాదం నిండింది. మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం అమనగల్‌లో శనివారం ఈ అనుమానాస్పద మృతి చోటుచేసుకుంది. అమనగల్‌కు చెందిన బైరిబోయిన మల్లయ్య-మల్లమ్మల కుమారుడు నరేష్‌(25)కు నెల్లికుదురు మండలానికి చెందిన ఓ యువతితో శనివారం రాత్రి 9 గంటలకు అమనగల్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఈ మేరకు నరేష్‌ కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో తనకు నీరసంగా ఉందంటూ నరేష్‌ తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీంతో వారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇంట్లో మంచంపై పడుకున్న నరేష్‌ కొద్ది సేపట్లోనే మరణించడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. నరేష్‌ మృతికి కారణాలు తెలియరాలేదు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.