close

తాజా వార్తలు

Published : 12/08/2020 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ఇంట ఏడాదికే విషాదం

విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటన

అక్కడే కందుకూరు తల్లీకుమారుల అంత్యక్రియలు

మంచి ఉద్యోగం.. ఉన్నతమైన కుటుంబం.. త్వరలోనే పండంటి బిడ్డను చూసుకోవచ్ఛు. తల్లిదండ్రులూ తాత, నానమ్మలై ఆనందపడతారంటూ ఎంతో ఆశపడ్డాడు. అయితే అగ్నిప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు అతడి ఆశలతోపాటు అమ్మనూ కబళించింది. ఆ ఇంట విషాదాన్ని నింపింది.

కందుకూరు పట్టణం: కందుకూరుకు చెందిన దుడ్డు వెంకట ప్రసాద్‌ ఎన్టీఆర్‌ విగ్రహ కూడలిలో కిరాణా దుకాణం నిర్వహిస్తుంటారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతూనే క్రమశిక్షణ అలవరిచారు. పెద్ద కుమారుడు పవన్‌కుమార్‌(30) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. చిన్న కుమారుడు మనోజ్‌కుమార్‌ రెండేళ్ల క్రితం నీట్‌లో మెరుగైన ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా ఇటీవల వివాహం చేశారు. పవన్‌కుమార్‌కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన, ఇంజినీరింగ్‌ చేసిన పరుచూరి మౌనికతో ఏడాది క్రితం ఆర్భాటంగా పెళ్లి చేశారు. వీరిద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. కరోనా కారణంగా పవన్‌కుమార్‌ కందుకూరుకు వచ్చి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. పది రోజుల క్రితం తండ్రికి కొవిడ్‌ సోకగా విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొంది శుక్రవారం తిరిగి రాగా తమ్ముడికి వైరస్‌ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందాడు. తర్వాత తల్లి వెంకట జయలక్ష్మితోపాటు తనకూ రాగా విజయవాడలోని అదే ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం అక్కడ జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో తల్లితోపాటు అసువులు బాశాడు. అతడి భార్య మౌనిక గర్భిణి కావడంతో కొద్ది నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. భర్త, అత్త మరణ వార్త వినగానే నిండు చూలాలైన ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. వెంటనే భర్త ఉన్న ఆసుపత్రి వద్దకు కుటుంబ సభ్యులతో కలసి చేరుకుంది. పెనిమిటిని కడసారి చూసుకొని కన్నీరుమున్నీరైంది. మరో నెల రోజుల్లో ప్రసవించనున్న ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదని పవన్‌కుమార్‌ మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలోనే అంత్యక్రియలు

విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో భార్య, పెద్ద కుమారుడు మృతిచెందినట్లు తెలుసుకున్న వెంకటప్రసాద్‌, ఆయన బంధువులు హుటాహుటిన కందుకూరు నుంచి అక్కడకు తరలివెళ్లారు. మరణించింది తమ వారు కాకుంటే బాగుండునని దేవుని ప్రార్థించుకున్నారు. తీరా విగతజీవులుగా పడి ఉన్న వారిని చూసి బోరున విలపించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ నెగిటివ్‌ వచ్చింది. దీంతో నిబంధనలు అన్నీ పూర్తి చేసి రాత్రి సుమారు 7 గంటల సమయంలో మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించారు. అప్పటికే బాధను తట్టుకోలేక కుప్పకూలి ఉన్న ఇంటి యజమాని, బంధువులు మృతదేహాలను కందుకూరు తీసుకొచ్చేసరికి బాగా ఆలస్యమవుతుందని భావించి విజయవాడలోనే అంత్యక్రియలు జరిపించి అర్ధరాత్రికి కందుకూరు చేరుకున్నారు. సాంప్రదాయం ప్రకారం త్వరలో కర్మకాండలు నిర్వహిస్తామని తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.