close

తాజా వార్తలు

Published : 13/08/2020 07:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుటుంబంలో నలుగురికి వైరస్‌..

ఇంటిపెద్ద ఆత్మహత్య

సిరికొండ: తనతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు కరోనా బారినపడిన క్రమంలో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో బుధవారం జరిగింది. సీఐ ప్రసాద్‌, మండల వైద్యాధికారి మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చెందిన లోలం నడ్పిరాజన్న(63) ఊళ్లో అందరితో కలివిడిగా ఉండేవాడు. ఆయన కుటుంబసభ్యులకు ఈ నెల ఏడున సిరికొండ పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రాజన్నతో పాటు కుమార్తె, ఇద్దరు మనవరాళ్లకు పాజిటివ్‌గా తేలటంతో ఇంటిపట్టున ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురైన ఆయన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలోనే దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.