ప్రైవేటు కంపెనీ ప్రతినిధిపై వైకాపా వర్గీయుల దాడి
close

తాజా వార్తలు

Updated : 15/09/2020 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు కంపెనీ ప్రతినిధిపై వైకాపా వర్గీయుల దాడి

పెళ్లకూరు : నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధిపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా పునబాక, చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని రౌతుసూరమాల గ్రామాల సరిహద్దుల్లో గ్రీన్‌ప్లై కర్ర పరిశ్రమ ఉంది. దీనికి కలప సరఫరా చేసే వారి మధ్య కొన్నాళ్లుగా వివాదం నెలకొనడంతో ఇటీవల పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పెళ్లకూరు మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఈ వ్యవహారంలో తలదూర్చారు. సోమవారం ఉదయం కంపెనీ ప్రతినిధి సందీప్‌ సర్కార్‌ కారులో శ్రీకాళహస్తి నుంచి విధులకు వెళ్తుండగా పునబాక దగ్గర కొందరు ఆగంతుకులు ఆపి దాడి చేశారు. బాధితుడు సర్కార్‌ కంపెనీకి వెళ్లి విషయం చెప్పి.. తర్వాత తొట్టంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలం నెల్లూరు జిల్లా పరిధిలో ఉండడంతో పెళ్లకూరు ఠాణాకు కేసు బదిలీ చేశారు. ఎస్సై రమ్య, సీఐ వేణుగోపాల్‌రెడ్డి వెళ్లి పూర్వాపరాలు ఆరా తీశారు. గూడూరు డీఎస్పీ రాజగోపాలరెడ్డి స్టేషన్‌కు వచ్చి విచారించారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ నెంబర్ల ఆధారంగా 11 మందిని గుర్తించారు. విజయ్‌భాస్కర్‌, తిరుపాలు, కుమార్‌, రాకేష్‌, లోకేష్‌, లింగమనాయుడు, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే, దాడికి పాల్పడ్డవారే పెళ్లకూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా తనను సాయంత్రం వరకు పోలీసులు అక్కడే ఉంచారని బాధితుడు ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని