close

తాజా వార్తలు

Published : 29/09/2020 08:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆట అబ్బురం.. జీవనం దుర్భరం

కాపరిగా మారిన అంతర్జాతీయ క్రీడాకారిణి

ఏషియన్‌ గేమ్స్‌లో సెపక్‌తక్రాలో రాళ్ల నవత ప్రతిభ

న్యూస్‌టుడే, ఖిల్లాగణపురం


గేదెను మేపడానికి తీసుకెళ్తున్న నవత

విభిన్నమైన సెపక్‌తక్రా క్రీడలో అంతర్జాతీయస్థాయి క్రీడాకారి ణిగా రాణించినా.. నవత కుటుంబం ఆరేళ్లుగా రేకుల షెడ్డులోనే దయనీయస్థితి మధ్య నెట్టుకొస్తోంది. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండల కేంద్రానికి చెరదిన రాళ్ల నవత 2014 సెప్టెంబరు 19న దక్షిణ కొరియాలో ఏషియన్‌ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లగా.. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ భారీ వర్షాలకు ఉన్న మట్టిమిద్దె సైతం కూలిపోవడంతో అప్పటి నుంచి నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటన చోటుచేసుకుని ఆరేళ్లు అవుతున్నా పిరిస్థితి మారలేదు. నేటికీ కుటుంబం కనీసవసరాలకు అవస్థలు పడాల్సి వస్తోంది.


ఏషియన్‌ గేమ్స్‌లో మేరీకోమ్‌తో రాళ్ల నవత

సెపక్‌తక్రా.. ఈ రకమైన క్రీడ ఉందనే విషయం తెలియని రోజుల్లోనే 2012 ఆటలో ఓనమాలు నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. తెలంగాణ రాష్ట్రం తరఫున 2014 సెప్టెంబరు 19న దక్షిణ కొరియాలో నిర్వహించిన ఏషియన్‌ గేమ్స్‌ ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఈ అమ్మాయే ఖిల్లాగణపురం గ్రామానికి చెందిన రాళ్ల నవత. హైదరాబాద్‌లో హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాల (స్పోర్ట్స్‌ అథారిటీ స్కూల్‌)లో ఉంటూ సెపక్‌తక్రా క్రీడలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటోంది. గోవా, గుజరాత్‌, నాగ్‌పూర్‌, కడప, నాగాలాండ్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి, మలేషియా, బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌) వంటి ఇతర దేశాలలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి ప్రశంసలందుకుంది. 2017లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (నల్గొండ) ఆధ్వర్యంలో నిర్వహించిన టీఎస్‌ పీఈ సెట్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)లో నవత రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించారు. రెండేళ్లు కోర్సును పూర్తిచేసి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ (మాస్టర్‌ ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సు మొదటి ఏడాది చదువుతోంది. లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు.

కుటుంబానికి ఆసరాగా.. : కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో నవత అయిదు నెలలుగా ఇంటికే పరిమితమైంది. తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేస్తున్నారు. పాడిగేదెలు కాస్తూ.. కుటుంబానికి చేదోడుగా ఉంటోంది. టోర్నీలంటూ వివిధ రాష్ట్రాలకు, విదేశాలకూ వెళ్లడంతో సమయమంతా ఆటతోనే గడిచిపోయేది. కుటుంబంలో అయిదుగురు ఆడపిల్లలమే కావడం, వ్యవసాయమే జీవనాధారం కావడంతో ఆర్థిక ఇబ్బందులున్నాయని.. దీంతో చిన్నప్పటి నుంచి అలవాటున్న వ్యవసాయ పనులు, గేదెల పెంపకంతో పాటు రోజూ పొద్దున్నే లేచి పాలు పితకడం చేస్తున్నానన్నారు. కొద్ది నెలలుగా ఇంటి వద్ద ఉంటున్నందున సాధనకు సైతం దూరమయ్యాయని నవత ఆవేదన వ్యక్తం చేస్తోంది.


ఆదుకుంటేనే..

రెండు పడక గదుల ఇంటిని నిర్మించి ఇస్తామంటూ నాయకులు హామీ ఇచ్చినా.. నెరవేరలేదని, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ప్రోత్సాహకం అందించి చేతులు దులుపేసుకుందని నవత తండ్రి పెద్ద గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు కూతురు ఆటల సాధనకు ఆటంకంగా మారిందని ఆయన వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.