
తాజా వార్తలు
అర్ధరాత్రి దాటాక.. ఆకతాయిల ఆగడాలు
రోడ్లపై ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు
కంకిపాడు బైపాస్ రోడ్డులో వేగంగా బండిని గాలిలోకి లేపుతూ డ్రైవింగ్
విజయవాడ: ‘అర్ధరాత్రి అయితే చాలు జాతీయ రహదారిపై ఆకతాయిలు ద్విచక్ర వాహనాలతో చక్కర్లు కొడుతున్నారు. విజయవాడ నగర శివారు రహదారుల్లో విన్యాసాలు నిత్యకృత్యంగా మారాయి. విజయవాడ-మచిలీపట్నం రహదారిపై కంకిపాడు సమీపంలో సుమారు పది మంది యువకులు అర్థరాత్రి దాటాక రోడ్డెక్కారు. వీరిలో కొంతమంది రోడ్డుపక్కన నిల్చోని ఉండగా.. మిగతా వారు వాహనాలపై జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ.. విన్యాసాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చిత్రాలు బయటకు రావడంతో. సీపీ బత్తిన శ్రీనివాసులు ట్రాఫిక్, పెనమలూరు పోలీసులను దర్యాప్తు చేయాలని ఆదేశించారు. స్వీయ జాగ్రత్తలు పట్టించుకోకపోవడం.. మద్యం మత్తులో ద్విచక్రవాహనాలను రంకెలు వేయించడం.. పొలాల్లో పాములు తిరిగినట్టు రోడ్లపై వాహనాలను తిప్పేస్తున్నారు. వాహనం నడిపేందుకు తగిన వయసు లేకుండానే కొందరు, చోదక అనుమతి లేకుండానే మరికొందరు, మద్యం మత్తులో ఇంకొందరు రహదారులపై అదుపులేని వేగంతో బైక్‌లు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
సమయం మనరోడ్లకు సరిపోవు..
స్పోర్ట్స్ బైక్‌ల ధరలు రూ.లక్ష నుంచి మొదలవుతాయి. వాటి ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి. ఈ వాహనాలు మన రోడ్లకు సరిపోవు. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారుల్లో 40కి.మీ కంటే వేగం మించకూడదని నిబంధన ఉంది. స్పోర్ట్స్ బైక్‌ల స్టాండ్ వేసి ప్రమాదకరంగా నడుపుతున్నారు. ఇది రోడ్డుకు, డివైడర్‌కు తగిలినప్పుడల్లా నిప్పురవ్వలు ఎగిసిపడుతుంటాయి. 350 సీసీ బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లను తొలగించి పెద్ద శబ్దం వచ్చేలా మార్పులు చేస్తున్నారు. గుండె అదిరే శబ్దంతో పాటు నిప్పురవ్వలు కూడా వస్తుంటాయి. దీనిపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అతిగారాభం వద్ధు.
* పిల్లలకు వాహనాలు కొనే విషయంలో తల్లిదండ్రులు జాగురూకతతో ఉండాలి. వారిని అతి గారాభం చేయొద్ధు అడిగారని ఖరీదైన వాహనాలు కొనిపించకూడదు. నైపుణ్యం, నిర్ణీత వయసు వచ్చే వరకు వేచి చూడాలి. విద్యార్థులకు స్పోర్ట్స్ బైకులు అవసరం ఉండదు.
* చట్టం ప్రకారం మైనర్లకు వాహనాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా శిక్షార్హుడే.
* రాత్రి వేళల్లో ఇంట్లో పిల్లలు బయటకు వెళ్తుంటే కచ్చితంగా ఓ కంట కనిపెట్టాల్సిందే.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
