close

తాజా వార్తలు

Published : 29/11/2020 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరుస సెలవులు.. కిక్కిరిసిన దారులు

ఎల్బీనగర్‌ జాతీయ రహదారిపై వాహనాల కోసం వేచి ఉన్నవారు

నాగోలు: వరుస సెలవులు రావడంతో నగర ప్రజలు గ్రామాల బాటపట్టారు. శనివారం ఎల్బీనగర్‌ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ వైపు వెళ్లే వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. శని, ఆదివారాలతోపాటు సోమవారం కార్తీకపౌర్ణమి, గురునానక్‌ జయంతి, మంగళవారం బల్దియా ఎన్నికల పోలింగ్‌ ఉండడంతో సెలవులు వచ్చాయి. దీంతో అనేకమంది నగరవాసులు ఊరికి పయనమయ్యారు. తుంగభద్ర నది పుష్కరాలతోపాటు బుధవారం నుంచి పెళ్లి ముహూర్తాలు ఉండటంతో ప్రయాణాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా విజయవాడ జాతీయ రహదారిపై దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు వాహనాల రద్దీ నెలకొంది. ఆయా బస్టాపుల్లో పెద్దసంఖ్యలో ప్రయాణికులు బస్సులు ఎక్కుతూ కనిపించారు. అసలే నగరంలో పోలింగ్‌ శాతం అంతంత మాత్రమే.. వేలాది మంది ఊళ్లకు వెళితే ఓటింగ్‌ మరింత పడిపోతుందని నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలింగ్‌ నాటికి చాలామంది వచ్చేస్తారని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని