close

తాజా వార్తలు

Updated : 01/12/2020 07:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అశ్రద్ధ చేయొద్దు అవకాశం వదలొద్దు

ఓటుపై ప్రముఖుల పలుకు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


మహానగర అభివృద్ధికి ఓటేద్దాం: ఎన్‌.శంకర్‌, దర్శకుడు

నేడు జరిగే ఎన్నికల్లో మనందరం తప్పనిసరిగా హక్కు వినియోగించుకుందాం. మహానగరం అభివృద్ధి కోసం ఓటేద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఒక్క ఓటే కదాని ఎవరూ అశ్రద్ధ చేయొద్ధు. అదే రేపు ఫలితాన్ని మార్చుతుంది.


ఆలోచించి ఓటేయాలి: అలీ, సినీ నటుడు

భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది.


మన కోసమే అన్న భావనతోనే ఉత్సాహం

-జయప్రకాశ్‌ నారాయణ, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు

ప్రజలు పాలనలో భాగస్వాములవ్వాలి. వార్డు కమిటీల్లో స్థానం కల్పించాలి. దిల్లీ తరహాలో స్వయం పరిపాలన అవసరం. ప్రజల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు అన్న భావన కలిగించాలి. అప్పుడే ఓటేసేందుకు ఉత్సాహం చూపిస్తారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన