
తాజా వార్తలు
ఒక ప్రకటన.. మూడున్నర కోట్ల మందికి!
దక్షిణాదిలో తొలి డిజిటల్ యాడ్ ప్యాకేజీ
సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ పేరిట ఏర్పాటు
బెంగళూరు: దక్షిణ భారతావనిలో ప్రముఖ వార్తా సంస్థలైన ఈనాడు, దినమలార్, మనోరమ ఆన్లైన్, ప్రజావాణి చేతులు కలిపాయి. దక్షిణ భారతంలోనే అతిపెద్ద, తొలి డిజిటల్ యాడ్ ప్యాకేజీని ఏర్పాటు చేశాయి. ఇందుకోసం సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ (ఎస్పీపీ)ను నెలకొల్పాయి. వాణిజ్య ప్రకటనకర్తలకు డిజిటల్ అడ్వర్టైజింగ్లో తోడ్పాటు అందించేందుకు గానూ ఈ నాలుగు ప్రముఖ దినపత్రికలు ఈ వేదికను ఏర్పాటు చేశాయి. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రకటనకర్తలు ఒకేసారి పెద్ద ఎత్తున వీక్షకులను చేరుకునే వీలు కలుగుతుంది.
సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ డిజిటల్ యాడ్ ప్యాకేజీకి... సుమారు 3.7 కోట్ల యునిక్ విజిటర్లు, 71.5 కోట్ల పేజీ వ్యూస్, 3.36 నుంచి 8.09 నిమిషాల సరాసరి సగటు వీక్షణలు ఉన్నాయి. అంతేకాదు ఎస్పీపీ డిజిటల్ యాడ్ ప్యాకేజీ నెలకు 300 కోట్ల యాడ్ ఇంప్రెషన్స్ కలిగి ఉంది. మిగిలిన డిజిటల్ ప్యాకేజీతో పోలిస్తే ఎస్పీపీ అడ్వర్టైజర్ల సొమ్ముకు పూర్తి విలువను అందిస్తుంది. వారి వ్యాపారాభివృద్ధికి దోహదపడుతుంది. ప్రతి డిజిటల్ ప్రకటనకర్తా ఈ నాలుగు మీడియా బ్రాండ్ల నుంచి పూర్తి అవగాహనతో పాటు, అనుకూలమైన పరిష్కారాలు పొందుతారు. అంతేకాదు డిజిటల్ న్యూస్‌ను వినియోగించేది ఎక్కువగా యువతే. 18 నుంచి 44 ఏళ్ల వయసు గల వీక్షకులు 73 శాతం మంది ఎస్పీపీ సొంతం. డిజిటల్ ప్రకటనకర్తలు రోడ్ బ్లాక్ యాడ్స్, డిస్ప్లే బ్యానర్ యాడ్స్, నేటివ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఈ వేదికను ఉపయోగించుకుని తాము కోరుకున్న వినియోగదారులను చేరుకోవచ్చు. యాడ్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం www.southpremiumpublishers.com వెబ్‌సైట్‌ను సంప్రందించండి.
‘‘సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ ప్రకటనకర్తలకు విశ్వసనీయతను అందిస్తుంది. డిజిటల్ బ్రాండ్ భద్రతతో పాటు అవగాహనను పెంపొందిస్తుంది. దేశంలో అతిపెద్ద డిజిటల్ పబ్లిషింగ్ వేదికలో మనోరమ ఆన్లైన్ కూడా భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’’
- మరియం మమ్మెన్ మాథ్యూ, సీఈవో, మనోరమ ఆన్లైన్
‘‘తమిళ డిజిటల్ మార్కెట్లో మేం మార్కెట్ లీడర్‌గా ఉన్నాం. 2019-20లో దేశవ్యాప్తంగా యాడ్ మార్కెట్లో 21 శాతం డిజిటల్ ద్వారానే సమకూరింది. డిజిటల్ అడ్వర్టైజింగ్కు నానాటికీ ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది డిజిటల్ ఆడియన్స్‌ను చేరుకునేందుకు అడ్వర్టైజర్లు, ఏజెన్సీలకు దక్షిణాదిలో ప్రముఖ పబ్లికేషన్స్ కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే మేమంతా విలువైన సమాచారం అందిస్తూ డిజిటల్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్నాం. ఇప్పుడు కన్సార్టియంగా ఏర్పడ్డాం. ఒకే ఒక్క కాంటాక్ట్‌తో ప్రకటనకర్తలు, యాడ్ ఏజెన్సీలు మా ద్వారా దక్షిణాదిలో తమ వాణిజ్య ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను చేరుకోవచ్చు. అది కూడా అందుబాటు ధరలోనే. ఇందుకోసం www.southpremiumpublishers.com పేరిట కన్సార్టియం వెబ్సైట్ రూపొందించాం. అందులో పూర్తి సమాచారం ఉంటుంది’’
- ఎల్. ఆదిమూలం, డైరెక్టర్ (బిజినెస్ అండ్ టెక్నికల్), దినమలర్
‘‘దక్షిణాదిలో వినియోగదారులను ఒకేసారి చేరుకోవడానికి సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ అవకాశం కల్పిస్తోంది. ప్రతి నెలా 3 కోట్ల యాడ్ ఇంప్రెషన్లు కలిగి ఉండడం ఎస్పీపీ సొంతం. ఇందులో ప్రజావాణి భాగం కావడం సంతోషంగా ఉంది’’
-అర్పణ్ ఛటర్జీ, సీవోవో, డిజిటల్- టీపీఎంఎల్, ప్రజావాణి.నెట్
‘‘ఈనాడు గ్రూప్ అంటేనే విలువలకు పెద్ద పీట వేసే సంస్థగా గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ డిజిటల్ ప్రకటనకర్తల కోసం ఈ వేదికను ఏర్పాటు చేశాం. మార్కెట్ రూపు రేఖలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. వ్యాపార నమూనాలు మార్పులకు లోనవుతున్నాయి. అందులో భాగంగానే అడ్వర్టైజర్లు దక్షిణాదిలో వినియోగదారులను చేరుకునేందుకు మేమంతా జట్టు కట్టాం’’
-ఐ.వెంకట్, డైరెక్టర్, ఈనాడు
పబ్లిషర్ల గురించి..
దినమలర్: తమిళంలో ప్రముఖ న్యూస్ వెబ్సైట్. 90 లక్షల యునిక్ యూజర్లు దీని సొంతం. ఈ సైట్‌కు 1.7 కోట్ల పేజీ వ్యూస్ ఉన్నాయి. రాజకీయం, ఆధ్యాత్మికం సహా బిజినెస్, స్పోర్ట్స్.. ఇలా 360 డిగ్రీల్లో వార్తలను అందిస్తోంది.
ఈనాడు: తెలుగులో నంబర్ 1 దినపత్రిక. రామోజీరావు దీన్ని నెలకొల్పారు. తెలుగులో 24/7 వార్తలను ఈనాడు.నెట్ అందిస్తోంది. తాజావార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, పాలిటిక్స్, బిజినెస్ వార్తలతో పాటు, సినిమా, క్రీడా, యూత్, కిడ్స్, మహిళలకు సంబంధించిన కథనాలను కూడా అందిస్తోంది. పురుషులు, మహిళలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతర దేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఈనాడు.నెట్ ప్రధాన వీక్షకులు.
మనోరమ ఆన్లైన్: మలయాళ మనోరమకు చెందిన డిజిటల్ విభాగం మనోరమ ఆన్లైన్. 23 ఏళ్లుగా డిజిటల్ విభాగంలో అనుభవం దీని సొంతం. 3.6 కోట్ల నెలవారీ యూజర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు తమ మాతృభాషలో వార్తలు చదువుకునే వీలు కల్పిస్తోంది మనోరమ ఆన్లైన్. తాజా వార్తలు, రాజకీయ వార్తలు, బిజినెన్, ఎంటర్టైన్మెంట్ విభాగాలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తోంది.
ప్రజావాణి: కన్నడ నాట ప్రముఖ దినపత్రిక ప్రజావాణి. కర్ణాటక నలుమూలల నుంచి వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఆ పత్రికకు చెందిన డిజిటల్ విభాగమే ప్రజావాణి.నెట్. 30 జిల్లాలకు చెందిన వార్తలను ఆయా జిల్లాల వారికి పర్సనలైజ్డ్ న్యూస్‌ను తన యాప్ ద్వారా అందిస్తోంది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
