
తాజా వార్తలు
పాతబస్తీలో సైక్లింగ్
వందల సంఖ్యలో ఓట్లు వేసిన మహిళలు యువకులు
ఎన్నికల అధికారులకు అనుమానం వెంటనే అదృశ్యం
ఈనాడు, హైదరాబాద్: పాతబస్తీలో పోలింగ్ గ్రేటర్‌లోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా జరిగింది. పాతబస్తీలో స్థానబలమున్నచోట్ల పోటీలో ఉన్న ఓ రాజకీయ పార్టీ అభ్యర్థులు గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు తమ కార్యకర్తలు, అనుచరులతో సైక్లింగ్ పద్ధతిలో ఓట్లు వేయించారు. ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులు, పోలింగ్ బూత్‌లో సిబ్బందికి ఏమాత్రం అనుమానం రాకుండా ఈ తతంగం పూర్తయ్యింది. పాతబస్తీలో మంగళవారం ఉదయం పోలింగ్ మొదలవగానే కొందరు అభ్యర్థులు మందకొడిగా పోలింగ్ కొనసాగుతోందని గ్రహించారు. సైక్లింగ్ పద్ధతిలో ఓట్లు వేయించుకుంటే చాలని గ్రహించి అనుచరులు, కార్యకర్తలను రప్పించారు. వారి ద్వారా డివిజన్లలో ఓటు హక్కున్న మహిళలు, యువకులను రప్పించారు. ఓట్లు వేసిరావాలని, డబ్బులిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు అంగీకరించగానే.. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని నాలుగు డివిజన్లు, చార్మినార్ నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత సైక్లింగ్ పద్ధతిలో వందల ఓట్లు వేయించారు. చార్మినార్ నియోజకవర్గంలో రెండు బూత్‌లలో యువకులు, మహిళలు సుమారు 30నిముషాల పాటు ఓట్లు వేశారు. వచ్చినవారే మళ్లీ వస్తుండడంతో ఎన్నికల అధికారికి అనుమానం వచ్చి ప్రశ్నించగా.. వారు వెంటనే వెళ్లిపోయారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న వీరు మిగిలిన చోట్ల సైక్లింగ్ పద్ధతిని నిలిపేశారు.
మధ్యాహ్నం తర్వాత పుంజుకున్న పోలింగ్.. సార్వత్రిక ఎన్నికలైనా... గ్రేటర్ ఎన్నికలైనా పాతబస్తీలో ఉదయం 9గంటలలోపు ఓటర్లు ఓటేసేందుకు ఇల్లు వదిలి బయటకు రారు. మంగళవారం జరిగిన మహానగర పోలింగ్‌లోనూ ఇదే సరళి కొనసాగింది. పాతబస్తీలోని 24 డివిజన్లలో ఉదయం ఏడు గంటలకు ఎన్నికల అధికారులు, పోలీసులు మాక్ ఓటింగ్ పూర్తి చేసుకుని ఓటర్ల కోసం ఎదురు చూస్తుండగా.. ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు.. ఎనిమిది గంటల ప్రాంతంలో ఘాన్సీబజార్, తలాబ్‌చంచలం, ఉప్పుగూడ డివిజన్లలో ఒక్కొక్కరే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పోలింగ్ శాతం పెరిగింది.
దక్షిణ మండలం పోలీస్ పరిధిలో పోలింగ్ శాతం
9గంటలు- 2.8
11గంటలు - 7.2
1 గంట - 16.2
3గంటలు - 28.00
5గంటలు - 36.5
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
