close

తాజా వార్తలు

Published : 03/12/2020 08:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేనకోడలిని మనువాడి..! ప్రియురాలినీ పెళ్లాడి!

పెద్దల పంచాయితీ

బి.బి.పట్నంలో యువతి తాళికి వెల

రోలుగుంట, న్యూస్‌టుడే: సమాజం సిగ్గుపడేలా.. హిందూ సంప్రదాయం మంట గలిసేలా తాళికి వెలకట్టారు అధికార పార్టీ నేతలు. రోలుగుంట మండలం బి.బి.పట్నంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడికి అదే గ్రామానికి చెందిన తన మేనకోడలితో గతనెల మూడోవారంలో వివాహమైంది. ఇది జరిగి మూడురోజులైనా గడవకముందే ఇదే గ్రామానికి చెందిన ప్రియురాలిని తీసుకెళ్లి అన్నవరం దేవస్థానంలో పసుపుకొమ్ము కట్టి భార్య అనిపించున్నాడు. అదే సమయంలో రాజమండ్రి తదితర ప్రాంతాల్లో రెండురోజులు గడిపి ఊళ్లోకొచ్చారు. విషయం తెలుసుకున్న తొలిభార్య, ఆమె తల్లిదండ్రులు పెళ్లికొడుకుని నిలదీశారు. తన కుమార్తె బతుకు అన్యాయమైందని పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలోనే రెండోభార్యగా తాళి కట్టించుకున్న తన ప్రియురాలితో తెగతెంపులు చేసుకునేందుకు పరిహారంగా రూ. రెండున్నర లక్షలు చెల్లించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. తొలివిడతగా కొంతనగదును అందజేశారు. మిగిలిన సొమ్ము చెల్లించేందుకు హామీపత్రం రాయించడంతో పాటు పెద్దలుగా వ్యవహరించినందుకు రూ.50 వేలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన చోటుచేసుకున్న తరువాత ప్రియురాలితో తెగతెంపులైనందుకు మనస్తాపం చెందిన పెళ్లికొడుకు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పెద్దలుగా అధికార పార్టీకి చెందిన వారే వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీనిపై రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావును వివరణ కోరగా, తమకు ఫిర్యాదు అందితే కేసు నమోదు చేస్తామన్నారు.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని