close

తాజా వార్తలు

Updated : 04/12/2020 08:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి కొడాలి నివాసంలో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

మంత్రి నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది

గుడివాడ, న్యూస్‌టుడే: ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నివాసంలో గురువారం బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నం నుంచి వచ్చిన యాంటీ బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బంది స్నిప్పర్‌ డాగ్‌ సాయంతో ఇంటి ఆవరణ, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రి కొడాలి నాని ప్రయాణించే వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ఇటీవల రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)పై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి కొడాలి నాని నివాసంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర నలుమూలల నుంచి మంత్రి నాని నివాసానికి వచ్చే వారిని మెటల్‌ డిటెక్టర్‌, స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన