
తాజా వార్తలు
ఆన్లైన్ రుణసంస్థ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
నర్సాపూర్, న్యూస్‌టుడే: క్రికెట్ బెట్టింగ్ భూతానికి చిక్కి..అన్లైన్లో అప్పుచేసి.. తిరిగి చెల్లించలేక..రుణ సంస్థ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది. ఎద్దు శ్రీరాములు, నాగమణి దంపతుల రెండో కుమారుడు శ్రావణ్(24) డిగ్రీ పూర్తిచేశాడు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటయ్యాడు. ఆన్లైన్లో దిల్లీ చిరునామాగా ఉన్న ఓ సంస్థనుంచి రెణ్నెల్ల క్రితం రూ.16 వేల రుణం తీసుకున్నాడు. దాన్ని బెట్టింగ్‌లో నష్టపోయి చెల్లించలేకపోయాడు. ఆలస్యం కావడంతో రుణసంస్థ యువకుడికి వాట్సాప్ ద్వారా లీగల్ నోటీసును పంపింది. దీంతో బెంబేలెత్తి తిరిగి చెల్లించేందుకు ఒక్కరోజు ఆగమని సంస్థ ప్రతినిధితో ప్రాధేయపడ్డాడు. ఆయన ససేమిరా అనడంతో మానసికంగా కుంగిపోయిన శ్రావణ్.. బుధవారం రాత్రి ఇంటిపైన పెంట్‌హౌస్ రెయిలింగ్‌కు ఉరేసుకున్నాడు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
