close

తాజా వార్తలు

Updated : 16/01/2021 08:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్య కాపురానికి రాలేదని..

విద్యుత్తు స్తంభంపై యువకుడు హల్‌చల్‌


విద్యుత్తు స్తంభం ఎక్కిన రవీంద్ర

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్య కాపురానికి రాలేదని ఓ ప్రబుద్ధుడు విద్యుత్తు స్తంభం ఎక్కి అత్మహత్యాయత్నం చేసిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గూడెం ఒకటో వార్డుకు చెందిన మేడా రవీంద్ర(27)కు అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఎనిమిది సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన రవీంద్ర గత కొంత కాలంగా భార్య, పిల్లలను వేధిస్తున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేని మహిళ పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయారు. రవీంద్ర తన భార్యను ఇంటికి తిరిగి రమ్మని కోరగా ఆమె నిరాకరించింది. మనస్తాపానికి గురైన రవీంద్ర ఆత్మహత్య చేసుకునేందుకు విద్యుత్తు స్తంభం ఎక్కారు. తన భార్య ఇంటికి తిరిగి వస్తేనే కిందకు దిగుతానని, లేని పక్షంలో విద్యుత్తు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్తు అధికారులు లైన్‌లో సరఫరాను నిలిపి వేశారు. స్థానికులు రవీంద్రను ఎంత సముదాయించినా స్తంభం దిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కె.గుర్రయ్య రవీంద్రతో చర్చించారు. దీంతో విద్యుత్తు స్తంభం పైనుంచి రవీంద్ర కిందకు దిగి వచ్చారు. చివరకు కథ సుఖాంతమైంది. పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని