close

తాజా వార్తలు

Updated : 16/01/2021 08:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరిపోయిన ఇంటిదీపాలు 

ఓ హ్‌.. ప్రీతి.. జ్యోతి.. పూర్ణిమ.. ప్రవీణ.. ఉషా.. వేదా.. శకుంతలా.. నిర్మలా.. అందరూ వచ్చినట్లేనా! ఒకే అందరూ ఇలా రండి.. ఓసారి ఫొటో తీసుకుందాం.. అంటూ ఆ వనితామణులంతా సందడి చేస్తుంటే కుటుంబ సభ్యుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది. ఏటా సంక్రాంతి శుభకామనలు చెప్పుకొన్నాక.. మరుసటి రోజు ఏదో ఒక విహారయాత్రకు బయలుదేరడం దావణగెరెలోని ఆ పాఠశాల పూర్వ విదార్థినులు.. నేటి గృహలక్ష్మిలకు ఓ వేడుక! ఈసారీ సంక్రాంతి ముగిశాక.. అర్ధరాత్రి దాటాక.. వారంతా అలా ప్రయాణానికి సిద్ధమై మినీ వాహనంలో బయలుదేరిన సంతోషం ఎంతోసేపు నిలవనేలేదు..


అయ్యో..పాపం : శకట శిథిలాల్లో చిక్కిన వారిని వెలికితీసే ప్రయత్నం

*మకర సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకొని వేకువజాము సమీపించే సమయానికి గోవాయాత్రకు నాలుగు పదులు నిండిన ఆ 16 మంది మహిళలు.. ఆ కుటుంబాలకే చెందిన ఓ బాలిక.. వాహన చోదకుడు మినీబస్సులో ప్రారంభించిన ప్రయాణం బెంగళూరు- పుణె మధ్య 48వ జాతీయ రహదారిపై ఎక్కువ సేపు సాగలేదు.
* వారిని సాగనంపి.. ఆయా కుటుంబాల వారు అలా కునుకుతీశారో.. లేదో.. ఏదో పీడకల వచ్చినట్లు అందరి ఇళ్లలోనూ ఫోన్లు మోగాయి. అరుపులు.. కేకలు.. ఆర్తనాదాలు.. నిద్రలేచీ లేవగానే కొందరు స్పృహతప్పి పడిపోవడం.. అదొక విషాద ఘట్టం. దావణగెరె నుంచి గోవాకు సాగాల్సిన వాహనం శుక్రవారం తెల్లవారుజామున గంటన్నర వ్యవధిలోనే.. ధార్వాడ వద్ద కుదుపునకు లోనయ్యింది. పదుల కుటుంబాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. మృతుల్లో కొందరు ధనిక కుటుంబాల వారు.. మరికొందరు స్నేహ సంపద వ΄టగట్టుకున్న వారున్నారు. ఆ కుటుంబాల వారు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. ప్రమాదంలో మృతిచెందిన వారిలో మాజీ ముఖ్యమంత్రి జె.హెచ్‌.పటేల్‌ సమీప బంధువు జ్యోతి, జగళూరు మాజీ ఎమ్యెల్యే గురుసిద్ధన గౌడ కోడలు- వృత్తిరీత్యా వైద్యురాలు వీణా ప్రకాశ్‌ తదితరులున్నారు. పలు ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలలో తీవ్ర విషాదం తాండవించింది. భారతదేశంలోనే అత్యంత తీవ్ర ప్రమాదాలకు 48వ జాతీయ రహదారి నెలవుగా మారింది. వాహనాల జోరే దీనికి కారణమవుతున్న వేళ.. అధికారులు ఏ స్థాయిలోనూ నివారణ చర్యలు తీసుకోలేక పోవడం విషాదాంకం. 


కన్నీటిసంద్రం : తల్లి కన్నువ΄సిందని తెలిసి కుమారుడి ఆక్రందన 


ఆఖరిచిత్రం: మృత్యు శకటం ఎక్కి.. స్వీయచిత్రం తీసుకుని ప్రయాణం ప్రారంభం



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని