close

తాజా వార్తలు

Published : 18/01/2021 07:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేడు ఖండిత విగ్రహాల తొలగింపు

● రామతీర్థంలో ప్రక్రియ

● ముందస్తు అనుమతులకు ఎస్పీకి దరఖాస్తు

నీలాచలం కొండపై ఉన్న కోదండరాముడి దేవాలయం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో ఖండిత విగ్రహాల తొలగింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కోదండరాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో పునఃప్రతిష్ఠాపనకు చర్యలు చేపడుతున్నారు. ఈ పురాతన ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఉన్నచోట ప్రాయశ్చిత్త హోమాల నిర్వహణకు ద్వారక తిరుమల నుంచి ఆగమ పాఠశాల ప్రధానాచార్యులు వంశీకృష్ణతో పాటు వేదపండితులు వస్తున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించాక విగ్రహాలను స్థానభ్రంశం చేస్తారు. అనంతరం వీటిని మరోచోట భద్రపరుస్తారు. తదుపరి బాలాలయం నిర్మాణానికి వేద పండితులతో మంచి ముహూర్తం నిర్ణయించేందుకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. నీలాచలం కొండపై కోదండరాముని ఆలయంలో హోమాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతులకు ఎస్పీకి దరఖాస్తు చేసినట్లు ఇన్‌ఛార్జి ఈవో రంగారావు తెలిపారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని