close

తాజా వార్తలు

Published : 19/01/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దుర్గగుడిలో... టిక్కెట్ల దొంగను పట్టేశారు..!

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గగుడిలో పాత దర్శనం టిక్కెట్లు రిసైక్లింగ్‌ చేస్తున్న యువకుడిని దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని సోమవారం పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నగరం పాతరాజరాజేశ్వరీపేటకు చెందిన అభిలాష్‌ మరికొందరు యువకులు ముఠాగా ఏర్పడి పాత టిక్కెట్లను భక్తులకు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ముగ్గురు పారిపోగా అభిలాష్‌ దొరికాడు. అతడి వద్ద ఉన్న పాత టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని దేవస్థానం ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించగా వారు విచారణ నిమిత్తం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా .. దేవస్థానం అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు. అతడి వద్ద లభించిన టిక్కెట్లు పాతవా..డూప్లికేట్‌వా ఇంతవరకు నిర్ధారించలేదని ఆయన చెప్పారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని