close

తాజా వార్తలు

Updated : 20/01/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వావ్‌..ఆటోవాలా..!

బంగారు నగను అందిస్తున్న దృశ్యం

తిరుపతి(నేరవిభాగం): ఓ ఆటోవాలా నిజాయతీని చాటుకున్నాడు. తిరుపతి రాఘవేంద్రనగర్‌కు చెందిన ఆర్‌.గోవర్ధన్‌, మంజుల ఈ నెల 16న విష్ణునివాసం నుంచి ఇస్కాన్‌ ఆలయానికి ఆటోలో ప్రయాణించారు. ఇస్కాన్‌ వద్ద దిగాక చేతికి ఉన్న 20 గ్రాముల బంగారు బ్రాస్‌లెట్‌ కన్పించకపోవడంతో.. తిరుపతి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సంప్రదించారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి ఆటో డ్రైవర్‌ ఆంజనేయులును పిలిపించి విచారించారు. బ్రాస్‌లెట్‌ ఆధారాలు దొరకనందున పంపివేశారు. ఈ నెల 18వ తేదీన ఆటోడ్రైవర్‌ తన ఇంటి వద్ద ఆటోను శుభ్రపరుస్తుండగా.. బ్రాసెలెట్‌ దొరకడంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. ఎస్పీ రమేష్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను పిలిపించి ఆటో డ్రైవర్‌ ద్వారా ఆ నగను అప్పగించారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని